Posts

స్మార్ట్ తెలుగు…ఎందుకు … ఏమిటి …?

ఆన్ లైన్ …………….. ఇప్పుడు అందరూ జపిస్తున్న మంత్రం. రమేష్ ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి , నెలకు లక్ష జీతం , కాని తన సొంతం గా ఏదయినా సాధించాలని ఆశ. ఒక “ఆన్ లైన్ స్టోర్” స్టార్ట్ చెయ్యాలని తన గోల్.కాని ఎలా స్టార్ట్ చెయ్యాలి, ఎక్కడ మొదలు పెట్టాలి ………………………….తన ఆలోచన ఆలోచన గానే ఉండిపోయింది. ముకుందరావు గారిది ఇంకో కధ, తనకి ఒక మంచి బ్రాండెడ్ బట్టల షాప్ ఉంది..కాని చాలా మంది అంత దూరం రాలేక తమ దగ్గరలో ఉన్న వేరే షాప్ లులో కొనేస్తున్నారు. దానితో తనకి రావాల్సిన సగం మంది కస్టమర్స్ ని కోల్పోతున్నాడు, అదే తనకో వెబ్ సైట్ ఉండి అందులో ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి డెలివరీ చేస్తే , ఎక్కువమందికి తన బిజినెస్ అందుబాటులో ఉంటదని ఆలోచన. కాని ఆ వెబ్ సైట్ లు, ఆ గోల తనకి అర్ధం కాదు. ……………………………..వ్యాపార విస్తరణ ఆలోచన గానే ఉండిపోయింది. నిర్మల హౌస్ వైఫ్ , పిల్లలు స్కూల్ కి వెళ్ళాక , టీవీ చూస్తూ గడిపేస్తుంది , టైం చాలా ఉంటుంది కాని , దానిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియట్లేదు, తను కాలేజీ లో కంప్యూటర్ కోర్స్ చేసింది, ఇంగ్లీష్ మీద మంచి పట్టు ఉంది. ఆన్ లైన్ లో మనీ సంపాదించొచ్చు అని తెల్సు. కాని ఎలా నో తెలియదు, ఆన్ లైన్ లో కొన్ని సైట్స్ ...
Recent posts