ఆన్ లైన్ ……………..
ఇప్పుడు అందరూ జపిస్తున్న మంత్రం.
రమేష్ ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి , నెలకు లక్ష జీతం , కాని తన సొంతం గా ఏదయినా సాధించాలని ఆశ.
ఒక “ఆన్ లైన్ స్టోర్” స్టార్ట్ చెయ్యాలని తన గోల్.కాని ఎలా స్టార్ట్ చెయ్యాలి, ఎక్కడ మొదలు పెట్టాలి
………………………….తన ఆలోచన ఆలోచన గానే ఉండిపోయింది.
ముకుందరావు గారిది ఇంకో కధ, తనకి ఒక మంచి బ్రాండెడ్ బట్టల షాప్ ఉంది..కాని చాలా మంది అంత దూరం రాలేక తమ దగ్గరలో ఉన్న వేరే షాప్ లులో కొనేస్తున్నారు. దానితో తనకి రావాల్సిన సగం మంది కస్టమర్స్ ని కోల్పోతున్నాడు, అదే తనకో వెబ్ సైట్ ఉండి అందులో ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి డెలివరీ చేస్తే , ఎక్కువమందికి తన బిజినెస్ అందుబాటులో ఉంటదని ఆలోచన. కాని ఆ వెబ్ సైట్ లు, ఆ గోల తనకి అర్ధం కాదు.
……………………………..వ్యాపార విస్తరణ ఆలోచన గానే ఉండిపోయింది.
నిర్మల హౌస్ వైఫ్ , పిల్లలు స్కూల్ కి వెళ్ళాక , టీవీ చూస్తూ గడిపేస్తుంది , టైం చాలా ఉంటుంది కాని , దానిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియట్లేదు, తను కాలేజీ లో కంప్యూటర్ కోర్స్ చేసింది, ఇంగ్లీష్ మీద మంచి పట్టు ఉంది.
ఆన్ లైన్ లో మనీ సంపాదించొచ్చు అని తెల్సు. కాని ఎలా నో తెలియదు, ఆన్ లైన్ లో కొన్ని సైట్స్ మనీ సంపాదించొచ్చు అని మన దగ్గరే మనీ వసూలు చేస్తాయి , టోపీ పెడతాయి.
……………………………..మరి ఎలా,ఎవరిని అడగాలో తెలియదు?
కావేరి కి మంచి మంచి desginer శారీస్ తాయారు చేయటం వచ్చు, ఆన్ లైన్ లో అసలు నిముషాలలో ఎటువంటి కోడింగ్ అవసరం లేకుండా వెబ్ సైట్ చేసుకొని అమ్ముకోవచ్చు అని తెలియక , ……………….శారీస్ తాయారు చేయటం లేదు .
వాసు ఆన్ లైన్ బిజినెస్ రన్ చేస్తున్నాడు…కాని తనకి కావాల్సిన మానవ వనరులు (Man Resource) దొరకట్లేదు. చాల సమయం తనకి కావాల్సిన పని చేసే మనుషలని వెతకటం తో నే సరిపోతుంది. అసలు మనుషుల తో అవసరం లేకుండా ఆన్ లైన్ లో నే తన బిజినెస్ కి ఉపయోగపడే మంచి మంచి టూల్స్ ఉంటాయి అన్న సంగతి తెలియదు.
పైన చెప్పుకున్న ఇబ్బందులు, రమేష్ కో,ముకుందరావు,నిర్మల,కావేరి,వాసుల కె కాదు,
మనలో చాల మంది ఫేస్ చేస్తున్న విషయాలు .ఇది నార్మల్ పీపుల్ కె కాదు , పెద్ద పెద్ద IT జాబులు చేస్తున్న వాళ్ళను వెంటాడుతున్న సమస్య.
సొంతం గా ఏదో ఒకటి చెయ్యాలనే తపన, నీరూపించుకొవాలనె కసి ఒకవైపు.
ఈ ఏరియా,ఈ సిటీ,ఈ స్టేట్,ఈ కంట్రీ అన్న పరిధి లేకుండా ఎక్కడ ఉన్న వారితో అయిన బిజినెస్ చెయ్యగల అవకాశం, తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభాలు సాధించగల అవకాశం ఇంకో వైపు.
ఇప్పుడు ప్రంపంచం మన అరచేతి లో ఇమిడిపోయింది , చేతిలో లాప్ టాప్ , స్మార్ట్ ఫోన్, వాటిలో ఇంటర్నెట్ ఉంటె చాలు …ఏదయినా సాధించవొచ్చు.
ఉదాహరణకి …..
మనం రోజు ఉపయోగించే Instagram లో నే ఒక ఆన్ లైన్ స్టోర్ రెడీ చెయ్యొచ్చు.
ఒక గంటలో ఆన్ లైన్ ఈ కామర్స్ సైట్ ఎటువంటి కోడింగ్ ఉపయోగించకుండా తాయారు చేయ్యవొచ్చు.
మెదడు లో ఆలోచన ఉండి కొంచం ఇంగ్లీష్ బాష ఫై పట్టు ఉంటే ఇంట్లో ఉండి బ్లాగ్గింగ్ ద్వారా సంపాదించవచ్చు .
మీ వర్క్స్ కోసం పర్సనల్ అస్సిటంట్ అవసరం లేకుండానే స్మార్ట్ ఆప్స్ తో ఆ పని చేసుకోవచ్చు. ~xX;SlVHA35i
ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకో గూగుల్ డేటా అంత సరిపోతది.
ఆన్ లైన్ బిజినెస్ గురుంచి ఆర్టికల్స్ ,
ఆన్ లైన్ లో మనీ సంపాదించే మార్గాలు ,
అందరికి ఉపయోగపడే ఇంటర్నెట్ టూల్స్ , మొబైల్ ఆప్స్ ల గురుంచి ఫ్రీ గా వివరించటం జరుగుతుంది.
అనిటికంటే ముఖ్యంగా మన తెలుగు లో…………………….
పోస్ట్ లను Share చేయటం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ కావాల్సిన వేరొకరికి ఉపయోగపడేలా సహాయం చెయ్యండి.
అతడు సినిమా లో బ్రహ్మనందం కామెడీ గా చెప్పినా (Knowledge is divine – ఎంత తాగితే అంత మంచిది )